జులాయ్‌లకు పెళ్లి చేయాలా? వద్దా? పెళ్లికి ఉద్యోగానికి లింకేంటి?

బుధవారం, 10 ఆగస్టు 2016 (09:40 IST)
ఏ వ్యక్తి అయినా పని పాట లేకుండా, బలాదూర్‌గా తిరిగితే వీడికి త్వరగా పెళ్లి చేయాలి, అప్పుడు బుద్ధిగా జీవిస్తాడు, బాధ్యతలు తెలిసొచ్చి, దార్లోకి వస్తాడు అని పెద్దలు అంటుంటారు. పూర్వం పెద్దలు ఎక్కువగా ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యేవారు. పనిపాటలేకుండా తిరిగేవాళ్లకి మొదట పెళ్లి చేస్తారు... ఆ తర్వాత బాగుపడ్డాడా అనేది తర్వాత విషయం. అయితే ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం.
 
పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అని కుటుంబ సభ్యులే మొదట నిలదీస్తారు. పెళ్లికి ప్రస్తుత అర్హత ఉద్యోగం. అయితే ఉద్యోగం చేయడానికి ఇష్టపడనివారు కూడా పెళ్లయ్యాక బుద్ధిగా ఉద్యోగం చేస్తారు. ఎందుకంటే ఇష్టమైన అమ్మాయిని అబ్బాయికిచ్చి పెళ్లి చేయడం వల్ల అతడిలో మార్పు వచ్చే అవకాశం ఉందని పెద్దలు అంటున్నారు. 
 
దీనిలో ఉండే కిటుక్కు ఏంటంటే.. భార్య.. జీవిత భాగస్వామి లాలించి, బుజ్జగించి ఉద్యోగం చేసేలా చేస్తుంది. పెళ్లి తర్వాత కొందరిలో తన భార్యను తానే పోషించుకోవాలి, ఆమె బాగోగులు తానే చూసుకోవాలనే అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దాంతో వారు ఉద్యోగం చేయాలని నిర్ణయానికి వస్తారు. అందుకే పెళ్లి చేస్తే దారిలో పడతారని పెద్దలు అంటుంటారు. 

వెబ్దునియా పై చదవండి