చదువుకోసం ఒకే గదిలో ఉంటున్నాం... అతడా పని చేశాడు... ఏం చేయాలి?

మంగళవారం, 13 నవంబరు 2018 (17:58 IST)
మేమిద్దరం క్లాస్‌మేట్స్‌మి. అతడి వయసు 27 సంవత్సరాలు, నా వయసు 26. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక హైదరాబాదులోని శివారు ప్రాంతంలో ఇద్దరం ఒకే గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాం. ఈ విషయం మా ఇద్దరి ఇళ్లలోనూ తెలియదు. మా చదువు పూర్తి అయ్యేందుకు మరో ఏడాదిన్నర పడుతుంది. ఇక్కడికి వచ్చి 10 నెలలు అయింది. గత పది నెలలుగా అతడు నన్ను ఏనాడు టచ్ చేయలేదు. ఇద్దరం ఎవరి హడావిడిలో వాళ్లు మునిగిపోతాము. 
 
ఇటీవల ఓ రోజు నాకు మంచి మార్కులు వచ్చాయని పొగడుతూ నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ సమయంలో అతడు రెండు చేతులతో నా ఎదపైన సుతిమెత్తగా నొక్కాడు. నాకు ఏదో కమ్మని అనుభూతి కలిగింది. ఆ తర్వాత కూడా అతడి చూపులు అక్కడే ఉంటున్నాయి. కానీ చేతులు వేసేందుకు భయపడుతున్నాడు. కానీ సందర్భం వచ్చినపుడల్లా అలాంటి ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తోంది. ఇలాగయితే ఇద్దరం తప్పు చేస్తామేమోనని డౌటుగా వుంది..?
 
అసలు తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండటం తప్పు. మీరు వచ్చింది చదువు కోసం. చేస్తున్నది వేరే. యవ్వనంలో వున్న స్త్రీపురుషులు ఒకే గదిలో వుండటం మంచిది కాదు. ఆ వయసులో ఏ పని అయినా సుఖంగానే అనిపిస్తుంది. కాకపోతే పెళ్లి కాక మునుపు ఇలాంటి చర్యలు చేస్తే తర్వాత అనేక అనర్థాలకు దారితీస్తాయి. అతడిని అలాగే వదిలేస్తే శరీరం మరో కోర్కె కోసం తహతహ లాడుతుంది. అది కూడా చేసేస్తే ఇక ప్రెగ్నెంట్ కావడం తప్పకుండా జరుగుతుంది. ఆ తర్వాత ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టమవుతుంది. కనుక ఇప్పటికైనా వెనువెంటనే ఆ గది ఖాళీ చేసి ఏదయినా ఉమెన్ హాస్టల్‌లో చేరి చదువుపై దృష్టి పెట్టండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు