సాధారణంగా మగవారు తమ పొట్టభాగం పెరిగితే ఎవరైనా మందు కొట్టడంతో వచ్చిన పొట్ట అని వెక్కిరిస్తారనే భయం కలిగి ఉంటారు. భవిష్యత్తులో కుటుంబ భారం మోయాల్సి వస్తుంది కాబట్టి, డబ్బు, వ్యయాలు మరియు పొదుపుల విషయంలో ఎక్కువ భయాందోళనలు కలిగి ఉంటారు. ఎత్తు గురించి ఆందోళన స్త్రీలలో తక్కువ, అయితే మగవారిలో ఈ విషయంపై ఎక్కువ ఆలోచన ఉంటుంది.
జనరల్‌గా మనకు తెలిసినంత వరకు అమ్మాయిలు ఫుడ్ మీద మంచి కంట్రోల్‌తో చక్కటి శరీరాకృతి మెయింటెయిన్ చేస్తుంటారు. కానీ అబ్బాయిల్లో కూడా డైటింగ్ చేస్తూ ఫుడ్ కంట్రోల్ పాటించేవారున్నారు. మగవారు కఠినాత్ములని, రిలేషన్‌షిప్ వంటి చిన్నచిన్న విషయాలు పట్టించుకోరనే భావన అందరికీ ఉంటుంది.
మగవారికి కూడా ఈ విషయం వలన రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుందేమోనని భయపడుతుంటారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి అబ్బాయిలు ఏడవకూడదు అని పిల్లలకు చెప్పే మాటలు వింటూనే ఉంటాము, దీని వలన వారు తమ భావోద్వేగాలను బయటకు చూపిస్తే బలహీనులుగా పరిగణిస్తారేమోనని తమలో తామే కుమిలిపోతుంటారు.