యుక్త వయసులో శృంగారంలో పాల్గొంటే వరుసగా ఒకటి రెండు భావప్రాప్తులు కలుగుతాయని చిన్నపుడు పుస్తకాల్లో చదివాను. ఆ తర్వాత నాకు పెళ్లయిన కొత్తల్లో ఆ అనుభూతి కలిగింది. ఆయనతో శారీరకంగా కలిసినపుడు ఒకదాని వెంట ఒకటి వరుసగా భావప్రాప్తులు కలిగాయి. కానీ, రెండు ప్రసవాల తర్వాత అలా జరగడం లేదు.
దాంపత్య జీవితంలో భావప్రాప్తిని అదృష్టంగా భావించకూడదు. ఎందకుంటే.. అది ఒక సాధన ద్వారానే లభించే అనుభూతి. భావప్రాప్తికి చేరువచేయగలిగే మెలకువలు, ఆ స్థితి నుంచి బయటపడకుండా మళ్లీ మళ్లీ అదే అనుభవాన్ని పొందగలిగే పనితనాల మీద మనకు అవగాహన ఉన్నప్పుడే వరుసగా భావప్రాప్తులు సాధ్యపడతాయి. అయితే, ఒకటి రెండు ప్రసవాలు అయ్యాక కూడా కొన్ని నియమాలు పాటిస్తే అలాంటి అనుభూతిని పొందవచ్చు.
భావప్రాప్తి పొందేవరకూ లైంగిక క్రీడ ఆపకూడదు. అంతర్గత రతి కంటే ముందు బాహ్య రతి ఎంతో ముఖ్యం. మొదటి భావప్రాప్తి తర్వాత ఆ వేగాన్ని అలాగే కొనసాగించాలి. భాగస్వామి అలసిపోయి, చాలనుకున్నప్పుడే ఆగాలి. అనేక భావప్రాప్తులు పొందాలంటే అందుకు శ్రమపడే శక్తి సరిపడా ఉండాలి. ఆ సమయంలో శరీరం... ఫ్రిక్షన్, ఒత్తిడి, నరాల ఉత్తేజం... వీటిన్నిటికీ లోనవుతుంది.
మీతోపాటు మీ భాగస్వామి కూడా ఈ పనికి సంసిద్ధంగా ఉండాలి. శ్వాస పీల్చడం, వదలడం, కండరాల పటుత్వాలను పెంచుకునే వ్యాయామాలతో ఎన్ని భావప్రాప్తులనైనా పొందవచ్చు. ఇంకోసారి లైంగికంగా దగ్గరయ్యేటప్పుడు ఒక భావప్రాప్తి పొందిన తర్వాత కూడా ఒకర్నొకరు ప్రేరేపించడానికి ప్రయత్నించండి. అలా చేయగలిగితే రెండవది, మూడవది కూడా పొందవచ్చు.