ప్రవచనంతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కల్యాణ మహోత్సవాలు, నీరాజనాలతో ఈ కోటి దీపోత్సవంలో భక్తులు పులకించిపోతారు. ఇక ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కోటి దీపోత్సవంలో ఓ మహాజ్వల ఘట్టం అనే చెప్పాలి.
శివలింగానికి స్వయంగా రుద్రాక్షలు, భస్మంతో అభిషేకం చేసే అవకాశాన్ని కూడా నిర్వాహకులే కల్పిస్తూ ఉండటం గమనార్హం. అలాగే దేవతల కల్యాణాన్ని చేయించినా, వీక్షించినా మహా పుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
అంతే కాదు ఒకే వేదికపై శివకేశవులను కోటి దీపాల మధ్య దర్శించుకునే మహా యోగమే కోటి దీపోత్సవం అని చెప్పవచ్చు. ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, వెలుగులీనే దీపాంతపులతో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.