చెల్లెల్ని పెళ్లాడిన క్రుద్దుడు.. కలిపురుషుడు అలా పుట్టాడు.. ఇక యుగంలో ధర్మమా?

బుధవారం, 16 జూన్ 2021 (19:40 IST)
Kalipurush
కలియుగం అంటేనే వినాశనం అంటారు ఆధ్యాత్మిక పండితులు. అలాంటి కలియుగ లక్షణాలు ఎలా వుంటాయంటే..? "క్రుద్దుడు" అనబడే వాడు "హింస" అనబడే తన తోడబుట్టిన చెల్లెల్నే వివాహమాడాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది. "ధర్మమా"! అంటే ఏమిటి? అనేవాడే కలిపురుషుడు. అటువంటి వాడు కలియుగ పాలకుడు అయితే ఇంకెంత అధర్మంగా పలికిస్తాడో ఆలోచించండి. 
 
కలియుగం వచ్చిన వెంటనే జరిగేది ఏమిటంటే నరులలో పవిత్రత నశిస్తుంది. పుణ్యము అంటే పవిత్రకర్మ అని. పవిత్రకర్మలు లేనివారై ప్రతివారూ దురాచారములయందు రతులై ఉంటారు. ఏవి సత్యములో ఆ మాటలపట్ల విముఖత్వం కలిగి ఉంటారు. సత్యము అంటే జరిగినది జరిగినట్లు చెప్పడమే కాదు త్రికాలములలోనూ నిలిచి ఉండు శాస్త్రవిషయము అని అర్థం.  స్త్రీలు ఎక్కువమంది భ్రష్టాచారులై భర్తను అవమానించడంలోనే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మామగారింటికి ఎసరు పెట్టే లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు.

అధర్మం చేయడంలో తెగింపు ఉంటుంది. కలియుగంలో శస్త్రాస్త్ర విద్యలు ఉండవు. గోవులను హింసిస్తారు. విప్రుల సంపదలపై ఆశలు పడతారు. క్షత్రియులు స్వధర్మాన్ని విడిచిపెట్టి అసత్పురుషులతో సాంగత్యం చేస్తూ పాపరతులై ఉంటారు. శూరత్వం ఉండదు. యుద్ధం అనగానే వెనకడుగు వేస్తారు. శత్రువులు ఎంతమంది విజృంభిస్తున్నా చేతకాని మెతకతనం పాలకులలో సంక్రమిస్తుంది. 
 
క్షత్రియులు అంటే ఇక్కడ జాతిమాత్రమే అని కాకుండా పాలకులు అని తీసుకోవచ్చు. దొంగలే పాలకులవుతుంటారు. సర్వపాపములూ చేస్తారు. దేహానికి అతీతమైనది ఒకటి ఉంది అని చెప్తే వీరికి ఎక్కదు. దానితో మూఢత్వం ఏర్పడి నాస్తికులై చరిస్తారు. 
 
నాస్తికులు అంటే 'నాస్తికో వేదనిందకః" అంటారు గౌతములు. వేదనిందకులై శాస్త్రములయందు విశ్వాసము లేనివారై పశుబుద్ధులతో తల్లిదండ్రులపై ద్వేషబుద్ధి కలిగి ఉంటారు. కలియుగంలో స్త్రీలే దేవతలు. కామమునకు కింకరులైపోతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు