గోవుకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెడితే..?

బుధవారం, 24 ఆగస్టు 2022 (18:44 IST)
గోవులు సాక్షాత్తు దైవస్వరూపాలుగా భావిస్తారు. సమస్త దేవతలకు ప్రతీకగా గోవును ఆరాధిస్తారు. గోవుల నుంచి వచ్చే ఏ పదార్థం అయినా మానవునికి ఉపయోగపడేవిగా ఉండటం విశేషం. ఆవును పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే గోవుకు సాధారణంగా గరికను ఆహారంగా పెడతారు.

కానీ ప్రతి ఆహార పదార్థానికి అది దేవతలు ఉంటారు. నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను ఆహారంగా పెట్టడం వల్ల ధనం అభివృద్ధి చెందుతుంది.

నానబెట్టిన గోధుమలను ఆహారంగా పెట్టడం వల్ల మన కీర్తి పెరుగుతుంది. బియ్యప్పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.

నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి, బెల్లము కొంచెం నీటితో కలిపి పెడితే మనకున్న దారిద్ర్యం తొలగిపోతుంది.

నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉడికించిన ఆలుగడ్డలను ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు