తిరుపతిలో రెచ్చిపోతున్న నకిలీ లడ్డూల ముఠా

మంగళవారం, 17 జనవరి 2017 (11:28 IST)
తిరుపతిలో నకిలీ లడ్డూల ముఠా ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి. నకిలీ లడ్డూలను శ్రీవారి లడ్డూలంటూ భక్తులకు విక్రయించి భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. స్వామివారి ప్రసాదమా.. అంటూ భక్తులు సులువుగా ముఠా చేతిలో మోసపోతున్నారు. పోలీసులకు ఎప్పటికప్పుడు చేతులు తడుపుతుండడంతో చూసిచూడనట్లు వెళ్ళిపోతున్నారు. తిరుపతి రెచ్చిపోతున్న నకిలీ లడ్డూల ముఠాపై స్నేహటివీ ప్రత్యేక కథనం. 
 
తిరుపతి ఆధ్మాత్మిక్షేత్రం. ప్రతిరోజ 50 వేలమందికిపైగానే భక్తులు తిరుపతికి వస్తుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే భక్తుల్లో చాలామందికి అనుకున్నంత లడ్డూలు దొరకవు. కారణం కేవలం విఐపిలకు మాత్రమే లడ్డూలను కావాల్సినంత టిటిడి ఇవ్వడం. దీంతో భక్తులు లడ్డూల కోసం దళారీలను ఆశ్రయిస్తుంటారు. మరికొంతమంది అయితే దళారీలు కూడా తెలియకపోవడంతో తిరుపతికి వచ్చేస్తుంటారు. అలా ప్రసాదాల కోసం వచ్చే భక్తులను సులువుగా మోసం చేస్తున్నాయి నకిలీ లడ్డూల ముఠా. నకిలీ లడ్డూలు ఎక్కడో దాచి ఉంచి అమ్మరు. బస్టాండ్ ఎదురుగా, రైల్వేస్టేషన్ ఎదురుగానే అమ్మేస్తున్నారు ముఠా సభ్యులు. ఒక్కో లడ్డూను 20 రూపాయలకు అమ్మి వేల రూపాయలు సంపాదించేస్తున్నారు.
 
నకిలీ లడ్డూల ముఠాకు వేరే పనిలేదు. గుండు కొట్టుకొని ఉన్న భక్తులను గుర్తించి వారి వెనుక బడి లడ్డూలను అమ్మేస్తారు. ఒక్క లడ్డూను 30 రూపాయలకు ప్రారంభించి ఆ తర్వాత 20 రూపాయలకు ముగిస్తారు. అలా రోజుకు 10 వేల లడ్డూలకుపైగానే తిరుపతిలో నకిలీ లడ్డూలను అమ్మేస్తుంది ముఠా. ఇదంతా పోలీసులకు కారణం. బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఈస్ట్ పోలీస్టేషన్ ఉంది. అయినా సరే నకిలీ లడ్డూలు మాత్రం యధేచ్ఛగా విక్రయం కొనసాగుతోంది. ఇప్పటికైనా నకిలీ లడ్డూల ముఠా ఆగడాలకు అడ్డుకట్టవేయాలని భక్తులు కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి