పాలు, పువ్వులు పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు.... అన్నీ లక్ష్మీరూపాలే. ధనం, ధ్యాన్యం అన్నీ అమ్మరూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత, వేదవిహిత ధర్మపాలన జరిగే ఇళ్ళల్లో లక్ష్మీ ఉంటుంది. అందువలన గోమాతను పూజించడం వాకిళ్ళు, గుమ్మాలకు, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి.
ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్ళల్లో లక్ష్మీఉండదు. రాత్రి ధరించిన బట్టలను తరువాతి రోజు ధరిస్తే లక్ష్మీ వెళ్లిపోతుంది. ధనం, ధాన్యం, పూజాద్రవ్యాలకు, పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మీకి కోపం వస్తుంది. ఎప్పుడూ తగాదాలుపడే వారింట్లో లక్ష్మీ ఉండదు. సోమరితనం, ప్రయత్నం లేకపోవడం లక్ష్మీకి వీడ్కోలు పలుకుతాయి. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మీ ఉండదు.
ఇకపోతే... లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది.
కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది.
గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పక మంచి ఫలితాలనిస్తుంది. మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం. అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు. అందుచేత మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి. ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.