ఆస్తి అంతస్తు వున్నాయి, కానీ పిల్లల్లేరు, ఏం చేయాలి?

శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:55 IST)
మన దేశం ఆధ్యాత్మిక తరంగాలతో నిండిపోయిన దేశం. ఏ పని చేసే ముందైనా ఆ భగవంతుని స్మరించి ప్రారంభించడం ఆనవాయితీ. వివాహం దగ్గర్నుంచి వ్యాపారం, చదువు ఇలా ఎన్ని తీసుకున్నా ప్రతి పనికి భగవంతుని స్మరణ చేస్తారు.

ఐతే కొంతమందికి డబ్బు, ఆస్తి, అంతస్తు వున్నా సంతాన భాగ్యం లేకుండా వుంటుంది. అలాంటివారు ఈ క్రింద చెప్పుకునేవి ఆచరిస్తే తప్పక ఫలితం వుంటుందని అంటున్నారు ఆధ్మాత్మికవేత్తలు. అవేంటో చూద్దాం.
 
ఇంటి బయటకు వచ్చి, నల్లని ఆవు చుట్టూ తలపై చెయ్యి ఉంచుకుని ప్రదక్షిణ  చేయాలి. తప్పకుండా సంతానప్రాప్తి  కలుగుతుంది. అలాగే స్త్రీలు ప్రతిరోజు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, అక్కడ దీపారాధన చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
 
సంతాన ప్రాప్తి కలగాలంటే వెదురు మెులకలను తీసుకొని, దానితో శివలింగం చేసి పూజ చేయాలి. కొద్దికాలంలోనే సంతానప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానప్రాప్తి కోసం ఇష్టకామ్య సింధూర తిలకాన్ని ధరించండి. హనుమంతుని మందిరంలో రాగి దానం చేయండి.
 
సంతాన ప్రాప్తికోసం గోధుమపిండి ఉండలు చేసి, వాటిలో కొద్దిగా శనగపప్పు, పసుపు కలిపి ఆవుకు తినిపించండి. ఇంకా సంతానం కోసం బాధ పడుతుంటే, తోటపని చేయండి. కొత్తకొత్త మెుక్కలను నాటి, వాటి సంరక్షణ చేయండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు