ఇలాంటి పువ్వులు పూజకు వాడకూడదా?

గురువారం, 12 జులై 2018 (11:26 IST)
పువ్వులతో చేసే పూజలో పువ్వుల ప్రాధాన్యత చాలా ముఖ్యం. దేవతార్చనలో వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తుంటారు. ఇక ఆయా దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించిన విషయాలు కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తాయి. ఇష్టదైవమేదైనా తాజాగా కోసిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలనేది మహర్షుల మాట.
 
భగవంతుడికి సమర్పించడానికి ముందుగా పువ్వులను వాసన చూడకూడదు. అలా వాసన చూస్తే ఆ పువ్వులు పూజకు పనికిరావు. అలాగే అపవిత్రమైన ప్రదేశాల్లో పూసిన పువ్వులు, వాడిపోయిన పువ్వులు, పూర్తిగా వికసించని పువ్వులు, క్రిందపడిన పువ్వులను ఏరుకుని వస్తుంటారు.

అలా నేలపై రాలిన పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు. చక్కని సువాసన గల తాజా పువ్వులు మాత్రమే భక్తిశ్రద్ధలతో భగవంతుడికి సమర్పించాలి. అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితంగా పుణ్యం దక్కుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు