అలా చేస్తే ధనవంతులు కాలేరు.. తెలుసా? చాణక్య నీతి

సెల్వి

సోమవారం, 19 ఆగస్టు 2024 (19:27 IST)
డబ్బును పొదుపు చేయడం ఒక కళ. పొదుపు చేసేవారికి జీవితంలో డబ్బుకు కొరత ఉండదనేది కూడా నిజం. ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రంలో చెప్పిన విధంగా జీవితంలో పొడుపు పాటిస్తే త్వరగా ధనవంతులు అవుతారు. ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పేదరికం నుంచి బయటపడలేరు. 
 
జీవితంలో ధనవంతుడు కాలేడని చాణక్య నీతి చెబుతోంది. మనచుట్టూ ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పొదుపు అత్యంత ముఖ్యమైన విషయం అనేది గుర్తిస్తేనే ధనవంతులు అవుతారు.
 
అలాగే పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తి ఆ పని చేసేందుకు ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని చాణక్య నీతి శాస్త్రం చెప్తోంది. 
 
అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకూడదు. ఎవరైనా తమ విధిని మార్చుకోవాలనుకుంటున్నారంటే.. తప్పనిసరిగా ఖర్చులను నియంత్రించుకోవాల్సిందేనని చాణక్య నీతి శాస్త్రం చెప్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు