మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య మంగళవారం నాడు వస్తుంది. ఈ అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రోజంతా మౌనంగా వుండకపోయినా.. సూర్యోదయం తర్వాత మౌన అమావాస్య కోసం కాసేపు అలా మాట్లాడకుండా వుండటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అమావాస్య పాప గ్రహాల శాంతి కోసం వస్తుంది.
మరోవైపు మౌని అమావాస్య సందర్భంగా అహ్మదాబాద్‌లో ప్రజలు పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజామునే నదీ తీరానికి చేరుకున్న ప్రజలు.. పుణ్యస్నానాలు చేశారు. మాఘమాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు గంగాస్నానం, మౌనవ్రతంలో ఉండటంతోపాటు.. ఈ రోజు ధానధర్మాలు చేస్తే చాలా ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.