కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

సెల్వి

శనివారం, 22 మార్చి 2025 (12:25 IST)
శివ పురాణం ప్రకారం, కాలాష్టమి రోజు కాల భైరవుడిని ఆరాధించడం వలన నవ గ్రహాల ప్రతికూల ప్రభావాలు, రాహు కేతు గ్రహాల అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఆదిత్య పురాణం - కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాల భైరవుడిని పూజించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది. 
 
ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
కాలభైరవుని అనుగ్రహంతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్ర వచనం. తేకాదు ప్రతి నెలా కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.
 
బ్రహ్మ శిరస్సును ఖండించిన శివుని స్వరూపమైన కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆ పాప ప్రక్షాళనకు ఘోరమైన తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలు తిరిగి చివరకు వారణాసికి చేరుకున్నాడు. అక్కడ కాలభైరవునికి మోక్షం కలుగుతుంది. అందుకే కాశీకి వెళ్ళినవారు కాలభైరవుని తప్పకుండా దర్శించుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు