చంద్రగ్రహణం తర్వాత వీలైనంత పూజలు చేయడం, ధ్యానం చేయడం మంచిది. దేవతలను ఆరాధించడం శుభప్రదం. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తిని నివారించడానికి పంచాక్షరీ మంత్రం, హరి-ఓం మంత్రం, మృత్యుంజయ జపం, దుర్గా మంత్రం, గణేష మంత్రాలను పఠించడం మంచిది. జీవితంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చంద్రగ్రహణం సమయంలో రోగ నివారణ పూజ చేయడం మంచిది.
తులా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీలలో విజయం సాధిస్తారు. బ్యాంకు పనులన్నీ పూర్తవుతాయి. దీంతో వైవాహిక జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.