కార్తీక మాసం పూర్ణిమ రోజు మంగళవారం రోజు మేషరాశిలో భరణి, నక్షత్రం మూడవ పాదములో రాహుగ్రస్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ఉత్తర, తూర్పు ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది.
చంద్ర గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం 02 గంటలు 39 నిమిషాలు
చంద్ర గ్రహణ మధ్యకాలం సాయంత్రం 04 గంటలు 29 నిమిషాలు
మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం రాశులకు అశుభం. మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశులకు శుభం.