పంచకవ్య దీపాన్ని వెలిగిస్తే.. లక్ష్మీనారాయణ పూజతో సమానం..

బుధవారం, 12 అక్టోబరు 2022 (21:58 IST)
Panchakavya Deepam
పంచకవ్య దీపాన్ని వెలిగించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, ఆవు, గోమయం, పేడతో తయారు చేయబడింది. ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. పూజగదిని పనీర్ చల్లి బాగా శుభ్రపరిచి రంగవల్లికలతో సిద్ధం చేసుకోవాలి. దానిపై పంచకవ్య దీపం పెట్టి నెయ్యి పోయాలి. 
 
దూదివత్తులతో దీపం వెలిగించాలి. ఈ దీపం పూర్తిగా వెలిగిపోయేంతవరకు వుంచి ఆపై ధూపం వేసి.. సాంబ్రాణి వేసేందుకు ఉపయోగించాలి. కాలిన భస్మాన్ని రోజూ నుదుటిపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి వారం శుక్రవారం ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఈ హోమం లక్ష్మీనారాయణ పూజ చేయడంతో సమానమని శాస్త్రాలలో చెప్పబడింది. వీలైతే ఈ దీపం వెలిగించిన తర్వాత స్వామికి కొంత నైవేద్యాన్ని సమర్పించి పిల్లలకు పంచవచ్చు. యాగం చేసిన పుణ్యం పూర్తి కావడానికి దానధర్మం తోడైతే సత్ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు