బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా?

శనివారం, 8 అక్టోబరు 2022 (23:06 IST)
Rice wash water
బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఆరోగ్యానికి బియ్యం కడిగిన నీరు కూడా మేలు చేస్తుంది. బియ్యం నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉన్న ముడతలన్నీ మాయమవుతాయి. 
 
బియ్యాన్ని శుభ్రమైన నీటిలో అరగంట నానబెట్టి, బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి, ఆపై నీటిని ఫిల్టర్ చేయండి. తర్వాత ఆ నీటితో ముఖం మరియు జుట్టును కడగాలి. ఇలా చేస్తే కేశాలు నిగారింపును సంతరించుకుంటాయి. 
 
అలాగే చర్మంపై ఉన్న ముడతలు అన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. బియ్యం నీటిని చర్మానికి పట్టిస్తే కణాలు పునరుజ్జీవింపబడతాయి. చర్మకాంతిని పెంచుతాయి. ఇందులోని పిండి పదార్ధాలు విరేచనాలు, మొటిమలు చర్మ మంటలను తొలగిస్తుంది. 
 
శుభ్రమైన కాటన్ గుడ్డను బియ్యం నీళ్లలో ముంచి ముఖంపై కొద్దిసేపు రుద్దితే చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు