ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే. యుద్ధరంగలో తనచుట్టూ బంధువులు, తోబుట్టువులు, స్నేహితులు వుండగా వారిని చంపడానికి సంశయిస్తున్న అర్జునిడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు పలు రకాలుగా నైరాశ్యాన్ని పోగొట్టేలా బోధించాడు. అందులో మనిషి బంధాలు ఎలా వుంటాయనేవికూడా వివరించారు. వాటిల్లో ఓ కథను పురాణాల్లో వ్యాసకర్తలు చొప్పించారు. ఆ కథను మరోసారి స్మరించుకుందాం.