నారాయణుడు అలసిపోయి అక్కడ గల ఒక పుట్టలో తలదాచుకుంటాడు. అంతేకాకుండా ఆకలితో, దాహంతో బాధపడుతుంటారు. నారాయణుడు పడుతోన్న అవస్థను గమనించిన నారదమహర్షి లక్ష్మీదేవిని కలుసుకుంటాడు. ఆమెని వెతుకుతూ భూలోకానికి వచ్చిన స్వామి ఆకలి, దాహంతో నానా బాధలు పడుతున్నాడని చెప్పారు మహర్షి.
ఆ మాట వినగానే లక్ష్మీదేవి చాలా బాధపడుతారు. తన ప్రాణనాథుడికి కలిగిన కష్టాన్ని గురించి ఆమె బ్రహ్మ, మహేశ్వరులకు విన్నవిస్తుంది. స్వామిని ఆకలి, దాహాల నుండి కాపాడమని కోరుతుంది. లక్ష్మీదేవి కోరిన వెంటనే బ్రహ్మ, మహేశ్వరులు ఆమె ఎదుట ప్రత్యక్షమవుతారు. స్వామి ఆకలి, దాహాలు తీర్చడం కోసం బ్రహ్మదేవుడు గోవు రూపాన్ని ధరించగా, పరమేశ్వరుడు దూడ రూపాన్ని ధరిస్తాడు.
ఇక లక్ష్మీదేవి గొల్లభామ రూపాన్ని ధరించి ఆ ఆవుదూడలను చోళరాజు గోశాలకు చేరుస్తుంది. అక్కడి నుండి ప్రతిరోజు అవి మేతకు వెళుతూ ఉండేవి. ఆ సమయంలోనే నారాయణుడు తలదాచుకున్న పుట్ట దగ్గరికి ఆవు వెళ్లి పుట్టలోకి పాలధారలు కురిపిస్తుంది. ఆ పాలతో నారాయణ స్వామి ఆకలి, దాహాలు తీరీపోతాయి.
ఇలా లక్ష్మీదేవి తన స్వామి ఆకలి, దాహాలను తీర్చడం కోసం గొల్లభామ రూపాన్ని ధరిస్తుంది. నారాయణుడి పట్ల చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ భూలోకానికి వచ్చినా, నారాయణును పట్ల ప్రేమానురాగాలను ఆమె దాచుకోలేకపోతుంది.