వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. ఆ దర్శనంతో పునర్జన్మ ఉండదు..

సోమవారం, 2 జనవరి 2023 (09:44 IST)
వైకుంఠ ఏకాదశి రోజు నారాయణ మంత్రాన్ని జపించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. నిత్యం శ్రీహరిని పూజిస్తే ఈతిబాధలు వుండవు. సంపదతో పాటు సంతోషం వెల్లివిరుస్తుంది. 
 
ఏడాదిలో వచ్చే 12 నెలల్లో 11వ మాసం పుష్యమాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.
 
ఈ రోజున నారాయణ స్వామి వారి దేవాలయాల్లో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం ఖాయమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. అన్నవరం, భద్రాచలం, మంగళగిరి, ధర్మపురి, విజయవాడ ఆలయాలు భక్తులతో  కిటకిటలాడుతున్నాయి. 
 
తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతోంది. ఇకపోతే.. తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కొనసాగుతోంది. రోజుకు 80వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు