విదుర నీతి సందేశం... గర్వంతో సకలమూ నాశనం...

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (21:52 IST)
ముదిమితో చక్కదనం పోతుంది. ఆశలు పెరిగితే ధైర్యం చెడిపోతుంది. మృత్యువుతో ప్రాణాలు పోతాయి. అసూయ వుంటే ధర్మం భ్రష్టం అయిపోతుంది. క్రోధం వల్ల సంపదలు హరించిపోతాయి. దుర్జనులకు సేవలు చేస్తే శీలం చెడిపోతుంది. కామం వల్ల సిగ్గు హరించి పోతుంది. గర్వంతో సకలమూ నాశనం అయిపోతుంది.
 
సంపద మంచిపనుల వల్ల కలుగుతుంది. తెలివితేటలవల్ల పెరుగుతుంది. శక్తి సామర్థ్యాల వల్ల నిలుస్తుంది. మనోనిగ్రహం వల్ల స్థిరపడి పోతుంది. ప్రజ్ఞా, మంచి కుటుంబంలో పుట్టమూ, దమమూ, వేద వేదాంగాలు నేర్చుకోవడమూ, పరాక్రమం, మితంగా మాట్లాడ్డం, యథాశక్తిగా దానధర్మాలు చెయ్యడం, చేసిన మేలు జ్ఞాపకం పెట్టుకోవడం... ఇవన్నీ చాలా మంచి గొప్ప గుణాలు.

వెబ్దునియా పై చదవండి