ప్రపంచంలో ఎన్నో రకాల పుష్పాలున్నప్పటికీ.. కొన్ని పుష్పాలతోనే దేవాతార్చన చేస్తారు. ముఖ్యంగా ఆది దేవుడైన... విఘ్నేశ్వరుడికి గరికతోనే అర్చిస్తారు. పువ్వుల్లో వినాయకుడికి మందార, తామర, రోజాలను అర్చనకు ఉపయోగిస్తారు. కుమార స్వామికి.. మల్లి, సూర్యకాంతి, తెలుపు తామర, సంపెంగ, కాకడాలు వంటివి ఉపయోగిస్తారు. అష్టపుష్పాలతో కుమారస్వామికి అర్చన చేస్తారు.
ఇక విష్ణుమూర్తికి తామర పువ్వులు, సంపెంగ, సన్నజాతి పువ్వులతో పూజిస్తారు. ఈ పువ్వులతో విష్ణువును పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. తామర పువ్వుల్లో దైవాంశ శక్తులు ఉన్నాయి. మల్లిపువ్వులకు పవిత్రత ఉంది. తులసీ పత్రం కూడా పవిత్ర పుష్పం కిందకే వస్తుంది.
ఈతిబాధలు తొలగిపోవాలంటే.. రోజా పువ్వులతో విష్ణుమూర్తిని అర్చించాలి. మల్లిపువ్వులతో అర్చన, గరికతో అర్చన చేయడం ద్వారా సంకల్ప సిద్ధి చేకూరుతుంది. మందార పూవులతో దేవతా పూజ చేస్తే.. చెడు మార్గంలో మన మనస్సును పయనింపజేయదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.