ఎలాంటి యంత్రాలను ఇంట్లో వుంచాలి?

శనివారం, 20 మార్చి 2021 (22:19 IST)
సకల ఐశ్వర్యాలు కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి సత్ర్పవర్తన కలిగి వుండి, సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ వుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటుంది శాస్త్రం. లోహాలతో చేసే తాబేళ్లు అలంకార సామగ్రి మాత్రమే. వాటితో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నది కేవలం ఓ నమ్మకం మాత్రమే. ఇందుకు శాస్త్రీయమైన ప్రమాణం ఏమీ లేదు. 
 
ఇకపోతే వెండి, రాగి, ఇత్తడి తదితర పంచలోహాలతో చేసే యంత్రాలను పూజా మందిరంలో వుంచి, నిత్య పూజాధికాలు చేసే పద్ధతి వుంది. ఈ యంత్రాలపైన రేఖల రూపంలో, బీజాక్షరాలతో దైవీశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కావాలి. 
 
కేవలం యంత్రం పైన రేఖలు, అలంకారం వుంటే సరిపోదు. సంబంధిత దేవత మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ట చేసినప్పుడే వాటిలోని దైవీశక్తి కొలువుంటుంది. అలా చేయని యంత్రాలు అలంకారప్రాయంగానే నిలుస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు