ఎడమచేత్తో తినడంగాని, తాగడం కాని పనికిరాదు. భోజనం చేయడం పూర్తయ్యాక అన్నీ తినకుండా కాస్త కాస్త విడిచిపెట్టాలి. అయితే పెరుగు, తేనె, నేయి, పాలు మాత్రం పూర్తిగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
భాగ్యాన్ని కోరేవారు మఱ్ఱి, జిల్లేడు, రావి, కలిగొట్టు, తుమ్మికి, కానుగు ఆకులు వాడరాదని పైఠీనసివచనం. మోదుగ, తామర గృహస్థులకు పనికి రాదని, సన్యాసులకు పనికొస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే బంగారం, వెండి, కంచు పాత్రలతో పాటు తామరాకు, మోదుగాకులను భోజనపాత్రలుగా ఉపయోగించుకోవచ్చు. కంచుపాత్ర గృహస్తులకు మంచిది. భోజనం పాత్రలో వేసేటప్పుడు మొదట నేతిని చూపించాలి. ఆకులమీదగాని, ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చొని తినడం ఆచారం.