నా జీవితం శూన్యం అని రావణాసురుడు ఎప్పుడు అనుకున్నాడు?

శుక్రవారం, 12 మే 2017 (20:56 IST)
లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి మొండెం భూమిపై పడి విలవిలలాడింది. వానరసేన జయజయ ధ్వానాలు చేసింది. అంతట లక్ష్మణుడు అన్న రాముడి పాదాలకు నమస్కరించాడు. రాముడు సోదరుడు లక్ష్మణుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇంద్రజిత్తు మరణవార్త విన్న రావణుడు గుండె విషాదంతో నిండిపోయింది. 
 
దేవ, గంధర్వలు నిశ్చింతగా తిరుగుతున్నాయి. మహర్షి సంఘాలు నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటున్నాయి. ఆ పరిస్థితులన్నీ చూసిన రావణుడు ఓ సామాన్య మానవుడి చేతిలో తన కుమారుడు మరణించడంతోనే తన జీవితం శూన్యమైందని విలపించాడు.

వెబ్దునియా పై చదవండి