శుభకార్యాల్లో మామిడి ఆకులు తోరణాలు ఎందుకు కడతారు...?

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (20:54 IST)
మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందనీ, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో చెప్పబడింది. ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. 
 
ఈ చెట్లు ఆంజనేయుడి ద్వారా భారతదేశంలోనికి వచ్చిందని పురాణగాథ. సీతాన్వేషణ సమయంలో మామిడి పండు వాసనకు ఆకర్షితుడై, ఆ పండుని తిని టెంకను నీళ్లలో విసిరేశాడట హనుమంతుడు. ఆ టెంక నీళ్లలో తేలుతూ భారత భూమిని చేరి చెట్టుగా మారిందని చెపుతారు. 
 
శివపార్వతుల కల్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందనీ, అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని, చివరికి అంత్యక్రియలో మామిడికట్టెను ఉపయోగిస్తారని చెపుతారు. ప్రాచీన కాలంలో వివాహానికి ముందు వరుడు మామిడి చెట్టుకు పసుపు, కుంకుమ రాసి ప్రదక్షిణం చేసి ఆ చెట్టును ఆలింగనం చేసుకునేవాడట.

వెబ్దునియా పై చదవండి