నిప్పులపై నడిస్తే కోరినవి నెరవేరతాయట...

సోమవారం, 31 మార్చి 2008 (21:48 IST)
WD
ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి మీకు మాల్వా ప్రాంతంలో 'చూల్' అని పిలువబడే ఓ ఆచారం గురించి పరిచయం చేయబోతున్నాం. ఈ సంప్రదాయం దులాండి( హోలీ మరుసటిరోజు) ఉదయం ప్రారంభమై సాయంత్రం పొద్దుపోయేవరకూ కొనసాగుతుంది. మండుతున్న నిప్పులపై నడిచేముందు మహిళలు అక్కడ ఉన్న మర్రి వృక్షానికి ఆ తర్వాత గాల్ దేవతకు మొక్కుతారు.

ఈ ఆచారంలో, నాలుగు అడుగుల వెడల్పు ఒక అడుగు లోతున మండే నిప్పులను నిల్వ ఉంచుతారు. ఆ నిప్పులు మరింత కణకణలాడేందుకు అందులో నేతిని పోస్తుంటారు. నిప్పులు బాగా ఎర్రగా కణకణలాడుతుంటాయో... అప్పుడు భక్తులు వాటిపై అవతల నుంచి ఇవతలికి నడవటం ప్రారంభిస్తారు.
WD


భక్తులలో ఒకరైన సోనా వెబ్‌దునియాతో మాట్లాడుతూ... తాను నిప్పులపై నడుస్తానని మొక్కుకున్నంతనే తన పెద్దన్నయ్యకు ఏడాదిలోపే వివాహమైందనీ, పండంటి పాప పుట్టిందనీ చెప్పింది. తన అభీష్టం నెరవేరినందుకుగాను మొక్కును చెల్లించేందుకు ఇక్కడకు వచ్చినట్లు ఆమె చెప్పింది. తొలిసారిగా నిప్పులపై నడవటానికి వచ్చిన ఆమె మరో నాలుగేళ్లపాటు ఈ మొక్కును ఇలాగే తీర్చుకోవలసి ఉంది. ఇక్కడ నిప్పులపై నడవటం ద్వారా తమ కొర్కెలు నెరవేరతాయని ఈ మహిళలు భావిస్తారు.

WD
శాంతిభాయి అనే మరో భక్తురాలు గత మూడేళ్లుగా నిప్పులపై నడుస్తున్నప్పటికీ తనకెలాంటి గాయాలు కాలేదని చెప్పింది. ఈ ఆచారం వెనుక ఓ గాథ ఉన్నది. సాతి (పరమేశ్వరుని సహచరిగా చెప్పబడే) అని పిలువబడే దేవత ప్రభావం ఈ మహిళలపై ఉన్నట్లు మాతో అక్కడివారు చెప్పారు. దక్షుని నిరాదరణకు గురైన సందర్భంలో సాతి మంటల్లో దూకింది. అప్పటినుంచి సాతిపట్ల తమకున్న భక్తిభావాన్ని చాటే క్రమంలో ఈ మహిళలు కూడా మండుతున్న నిప్పులపై నడవటమనే సంప్రదాయాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. ఇటువంటి సంప్రదాయలపట్ల మీరేమనుకుంటున్నారో మాకు రాస్తారు కదూ...