రోజువారీ జీవితంలో మనం వందలాది ప్రజల ముఖాలను చూస్తుంటాము. వారిలో సుందర వదనాలు, చిరునవ్వులు ఒలికించే వదనాలు, గంభీర వదనాలు, చంద్రబింబంలా గుండ్రంగా ఉండే ముఖాలను లేదా నలుచదరపు ముఖాలను లేదా కోలముఖాలను ఇలా అనేక ముఖ రూపాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ముఖ రూపాలు దేన్నయినా స్పురింపజేస్తున్నాయా? వారి ముఖాన్ని చదవటం ద్వారా మనం వారి వ్యక్తిత్వాలను అంచనా వేయగలమా?
అంచనా వేయగలం అంటున్నారు. ఈ భావనపై ప్రపంచ వ్యాప్తంగా బలంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. చార్లెస్ లెబ్రన్ పేరు గల ఫ్రెంచ్ చిత్రకారుడు చిత్రించిన ఈ చిత్రాలను చూడండి. 17వ శతాబ్దంలో (1619-1690 పద్నాలుగవ లూయిస్ రాజు ఆస్థానంలో తొలి పెయింటర్) ఇతను జీవించాడు. ఇతడు గీసిన చిత్రాలను తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీలో కనిపిస్తాయి. ఇతడు కొన్ని ముఖాలను చిత్రించాడు. కానీ వాటి కింద చాలా వరకు జంతు ముఖాలు ప్రతిబింబిస్తూండటం గమనార్హం.
చార్లెస్ లె బ్రన్ మనుషుల ముఖాలను వారి వ్యక్తిత్వాలను అధ్యయనం చేశాడు. ఇతడి అభిప్రాయం ప్రకారం, జంతువును లేదా పక్షిని ప్రతిబింబించే వ్యక్తి ముఖం ఆ జంతువు లేదా పక్షి యొక్క ఒకటి లేదా రెండు లక్షణాలను ప్రతిబింబిస్తాయంటాడు. అతడి అధ్యయనం, కనుగొన్న అంశాలు పిజయానమీలో అతి ముఖ్య స్థానం సంతరించుకున్నాయి. వ్యక్తి ముఖం మరియు కనిపించే రూపం నుంచి అతడి లేదా ఆమె వ్యక్తిత్వాన్ని నిర్వచించే కళను పిజయానమీ అని పిలుస్తున్నారు.
WD
ఉదాహరణకు ఒక వ్యక్తి ముఖం కుక్క ముఖాన్ని ప్రతిబింబిస్తోందంటే, అతడి వ్యక్తిత్వం కుక్కను పోలి ఉంటుందని, అతడి అరుపు కుక్క మొరుగుడు లాగా ఉంటుందని మనం భావించవచ్చా? లేదా కుక్క లక్షణాన్ని అద్భుతంగా కనబరుస్తూ అతడు తన యజమానికి చాలా విశ్వసనీయంగా ఉండగలడని మనం భావించవచ్చా? లేదు.. ఇలాంటి అభిప్రాయానికి వచ్చామంటే అది చాలా అశాస్త్రీయంగా ఉంటుంది.
WD
అయితే, మన దేశంలోనూ మనిషి ముఖాన్ని చదివి అతడి ప్రవృత్తిని, స్వభావాన్ని అంచనా వేసే పద్ధతి ఒకటి ఉంది. ఈ కళ సాముద్రిక లక్షణం అని పిలువబడుతోంది. ఇది మన గడ్డపై చాలా కాలం నుంచి వాడుకలో ఉంది. ముఖాన్ని చూసి వ్యక్తి స్వభావాన్ని, చివరకు అతడి జాతకాన్ని సైతం కనిపెట్టే పద్ధతిని మన దేశంలో జ్యోతిష్కులు ఏనాటి నుంచో అనుసరిస్తూ ఉన్నారు.
మేము చార్లెస్ లె బ్రన్ చిత్రాలను చూపించినప్పుడు పిజియానమీని సాముద్రిక లక్షణంతో మన జ్యోతిష్కుడు కె.పి విద్యాధరన్ ఎలా పోల్చి చూశారో వినండి: "ఏనుగు కళ్లను పోలిన కళ్లను కలిగి ఉన్న కొంతమంది ప్రజలను మేం చూస్తూ వచ్చాము. అయితే వారి దృష్టి మాత్రం ఏనుగుల చూపు వలే చాలా నిశితంగా ఉంటుంది. కొంతమంది ప్రజల కళ్లు పిల్లి కళ్లలా ఉంటాయి. ఇలాంటివారు ఏ పని చేసినా పిల్లి అంత జాగరూకతతో ప్రారంభిస్తారని నా పరిశీలనలో తేలింది. అయితే తర్వాత పని ముగించేటప్పుడు కూడా పిల్లి అంత జాగ్రత్తగానే ముగించేవారు.
కొంతమంది ప్రజల ముఖాలు గుర్రపు ముఖాలను పోలి ఉంటాయి. గుర్రంలాగే ఈ వ్యక్తులు ఏ మాత్రం అలుపు లేకుండా తిరుగుతూ ఎంతపనైనా అవలీలగా చేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది ముఖాలు చిలుక ముఖాన్ని పోలి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు చిలుకలాగే కష్టపడి పనిచేస్తారు పైగా వాటిలాగే భవిష్యత్తు కోసం కొంత ఆదా చేసుకుంటారు. కష్టపడి పనిచేసి సంపాదనలో పొదుపు చేయడం ద్వారా తమ చెల్లెళ్ల వివాహాలను ముగించి జీవితంలో బరువు బాధ్యతలను ముగించుకున్నామని వీరు చెబుతుంటారు.
WD
కాబట్టి ప్రతి మనషిలోనూ మనం చూసిన అనుభవం బట్టి, జంతువు లేదా పక్షి ముఖ రూపాన్ని ప్రతిబింబించే వారి ముఖంలో ఆ జంతువు లేదా పక్షి స్వభావం ప్రతిబింబిస్తూ ఉంటుంది".
అయితే మనం దీన్ని సమగ్ర జ్ఞానం అని చెప్పవచ్చా? ఇది లోతుగా చర్చించవలసిన విషయం మరి. ఒక మనిషి స్వభావాన్ని అంచనా వేయాలంటే మనం కేవలం మనిషి ముఖ పరిశీలన మీద మాత్రమే ఆధారపడలేము. మరి ఈ విజ్ఞానం లేదా పద్ధతుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇవన్నీ నమ్మగలరా? దయచేసి మాకు రాయండి.