గేదెలకు బిస్కత్తులివ్వండి...పాలు తీసుకోండి !

పచ్చ గడ్డి, కసువు, తవుడు, శెనగపిండి, ఇలాంటివి పశువులకు ఆహారంగా పెడుతుంటాము. వీటిలో ఆవు, బర్రెలకు మరీ ఎక్కువగా పెడుతుంటాము. ఎందుకంటే అవి మనకు పాలిస్తాయికనుక. కాని ఇప్పుడు ప్రత్యేకంగా ఆవు, గేదె(ఎనుములు) "హెర్బల్ బిస్కత్తులు" మార్కెట్లో లభ్యం కానున్నాయి.

దాదాపు 16 రకాల వన మూలికలతో తయారైన ఈ బిస్కత్తులు పాలిచ్చే పశువులకు ఎంతో లాభదాయకం. ఇలాంటి బిస్కత్తులు వాటికి ఆహారంగా ఇస్తే అవి పుష్కలంగా పాలను ఇస్తాయని దేశీయ డాక్టర్. దీపక్ ఆచార్య వైద్యశాస్త్ర ప్రపంచంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

ఆదివాసీలనుండి సంగ్రహించిన పరిజ్ఞానంతో మనిషికి, పశువులకు సంబంధించిన జబ్బులనుకూడా వనమూలికలతో వైద్యం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

పాతాలకోట్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ అక్కడి ఆదివాసీలనుంచి కొన్ని నమూనాలను సేకరించి వారు వాడే ఔషధాలగురించి అధ్యయనం చేశారు. వారితో పది సంవత్సరాలపాటు కలిసి పరిశోధనలు చేసి దాదాపు ఇరవై వేల చిట్కాలు, హెర్బల్ ఫార్ములాలను సేకరించారు.

ఆదివాసీలనుంచి సేకరించిన చిట్కాల నమూనాలు అధ్బుతంగా పని చేస్తున్నాయని ఇవి వాడడం వలన పశువులలో జీర్ణశక్తి మెరుగుపడి పాలను అధికంగా ఇస్తున్నాయని ఆయన తెలిపారు. వన మూలికలతో తయారు చేసిన బిస్కత్తులు ప్రతిరోజూ రెండు చొప్పున రోట్టలద్వారా ఇస్తే అవి ఎంతో ఇష్టంగా తింటున్నాయని ఆయన పేర్కొన్నారు.

అంతే కాకుండా గేదెలపాలనుకూడా ఎక్కువగా ఇస్తున్నాయని ఆయన వివరించారు. కాగా ఈ రకమైన బిస్కత్తులకు, వైద్యానికి పేటెంట్ హ్కకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి