కింది నుంచి చూస్తే ఆ ఆలయం ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది. దాని గోపురం ఎత్తు 216 అడుగులు. ఇంత ఎత్తైన దేవాలయం కోసం ఎంత లోతు పునాది తీశారో అనుకుంటాం. ఇది సహజం. కాని ఆ దేవాలయానికి అసలు పూనాదే లేదు. నమ్ముతారా ? ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా.. ఇది నిజం.
ఇంత ప్రత్యేకత ఉన్న ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. మేరు పర్వతంలాంటి ఎత్తైన ఈ కట్టడం కళలు, ఆధ్యాత్మికతకే కాదు, వెయ్యేళ్ళ కిందటి నిర్మాణ నైపుణ్యతకు అద్దం పడుతోంది. ఇంత వరకూ ఈ నిర్మాణం చెక్కు చెదరలేదు. ఇలా ఒకటి కాదు. రెండు కాదు. వెయ్యేళ్లుగా అలాగే ఉంది. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.
క్రీస్తు శకం 1003-09లో ఆ ప్రాంత రాజు అయిన రాజరాజ చోళుడు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ పవిత్ర దేవాలయంలోనికి ప్రవేశించగానే 13 అడుగుల ఎత్తు ఉన్న శివలింగం కనిపిస్తుంది. ఐదు పడగల నాగేంద్రుని నీడన శివలింగ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తారు. ఈ మొత్తం నిర్మాణంలోకి ఇది ఒక అద్భుత దృశ్యం.
WD
దీని చుట్టూ ఆరడుగులు ఖాళీ ఉండేటట్లు రెండు వెడల్పాటి గోడలను నిర్మించారు. వెలుపలి గోడపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కళా సంపదను సమకూర్చారు. చతురస్రాకారంగా ఉన్న ఈ నిర్మాణం ఒకటికిపైగా చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ నిర్మాణాన్ని మొత్తం రాతితోనే కట్టారు. ఈ రెండు ప్రహారీల మధ్య ఉన్న విరామమే ఈ భారీ నిర్మాణ అందానికి కేంద్రబిందువు.
WD
శివలింగ గోపురంపై 14 రకాల నిర్మాణాలు కనిపిస్తాయి. శివలింగంపై 216 అడుగుల వరకు కూడా ఖాళీగానే ఉంది. చివరిదైన 14వ నిర్మాణంపై దాదాపుగా 88 టన్నుల బరువు కలిగిన రాతి గుండును నిలిపారు. దీని బరువు మొత్తం నిర్మాణంపై పడుతుంది. ఇది చోళుల శిల్పకళలకు నిదర్శనం. అన్నిటికంటే పైభాగాన 12 అడుగుల కుంభాన్ని ఏర్పాటు చేశారు.
లోపల ఉన్న ఖాళీ ప్రదేశమంతా శిల్ప, వాస్తు కళలతోనే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో గోపుర నిర్మాణంలోని మెళుకులనే చిదంబరంలోని తిల్లై నటరాజ లయ నిర్మాణంలో కూడా వినియోగించారు. ఈ నిర్మాణ విధానమే చిదంబర రహస్యంగా కీర్తి గాంచింది.
ఇది సాధ్యమా...? అని ఎవరైనా అడగొచ్చు. ఇది సాధ్యమేనని నిరూపణ అయ్యింది కూడా. ఇదే విధానాన్ని అనుసరించి తరువాత కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తుగల తిరువళ్ళువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఖాళీ స్థలంతో కూడి ఉంటుంది. నిర్మాణానికి పునాది ఉండదు. తిరువళ్ళువర్ విగ్రహాలు చెక్కిన రాళ్ళను ఈ నిర్మాణంపై పేర్చారు.
2004లో వచ్చిన సునామీ అలలు ఈ నిర్మాణాన్ని తాకినా చెక్కుచెదరలేదు. దక్షిణ భారత దేశంలోని చాలా దేలాయాలు పెద్ద పెద్ద రాజగోపురాలనే కలిగి ఉన్నాయి. అలాగే చివరలో డోమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బసవేశ్వర దేవాలయంపై నిర్మించినంతటి గోపురం మరెక్కడా లేదు.
WD
కోటలు, దేవాలయాల నిర్మాణానికి భారతదేశం పెట్టింది పేరు. ఇందులోని శిల్ప,వాస్తు కళలను ఊహలకందనివిగా ఉంటాయి.ఇదే దేవాలయంలో పెద్ద నంది విగ్రహం కూడా ఉంది. దీని ఎత్తు దాదాపు 12 అడుగులు. 19.5 అడుగులు వెడల్పు కలిగి ఉంటుంది. యునేస్కో దీనిని ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. తంజావూర్ వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించాల్సిన నిర్మాణమని సూచించింది. భారత పురావస్తు శాఖ దీనిపై అత్యంత జాగురుకతతో వ్యవహరిస్తోంది.