నందీశ్వరుడు లేని శివాలయం

FileFILE
మహారాష్ట్రలోని నాశిక్ పట్టణంలోని పంచవటి అనే ప్రాంతంలో కొలువైన ఆలయం కపలేశ్వర్ మహదేవ్ ఆలయం. ఇక్కడ పరమశివుడు నివశించినట్టు స్థానికు అభిప్రాయపడుతుంటారు. సాధారణంగా.. శివాలయంలో శివుని విగ్రహానికి ముందుగా నంది విగ్రహం ఉంటుంది. అయితే.. ఈ ఆలయంలో మాత్రం నందీశ్వరుడు కొలువై ఉండడు. భారతదేశంలోనే శివాలయాలల్లో నందీశ్వరుడు లేని ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయాన్ని ఈ వారం తీర్థయాత్రలో మీకు పరిచయం చేస్తాం.

కపలేశ్వర్ మహదేవ్ ఆలయంలో నంది విగ్రహం లేకపోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఇంద్రసభలో ఒక రోజు బ్రహ్మ, శివుని మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆ సమయంలో బ్రహ్మ తన ఐదు శిరస్సులను ప్రదర్శించగా, వీటిలో నాలుగు వేదాలను పఠించగా, ఒక తల మాత్రం శివుడుని తథేకంగా చూసింది.

దీంతో మరింత ఆగ్రహానికి గురైన శివుడు... ఆ తలను ఖండించాడు. ఇది బ్రహ్మహత్యగా (బ్రహ్మణుని హత్యచేయడం) దోషంగా మారింది. ఈ దోషాన్ని నివృత్తి చేసుకునేందుకు పరమశివుడు ప్రపంచ పర్యటన చేపట్టారు. అయినప్పటికీ.. ఆయన ఎలాంటి దోష నివృత్తి పొందలేక పోయారు.

ఈ దోష పరిహారం కోసం భూలోకం మొత్తం శివుడు పర్యటించినప్పటికీ ఆయనకు ఏ మార్గం తోచలేదు. తదనంతరం దోష నివారణ కోసం సోమేశ్వరం అనే స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ గోవు... బ్రాహ్మణుడిని తన కొమ్ములతో పొడిచి బ్రహ్మహత్యకు గురి చేసిన తన దూడకు పరిహార నివృత్తిని చెప్పడాన్ని పరమేశ్వరుడు గమనించాడు.

అనంతరం బ్రహ్మహత్యకు గురైన ఆ గోవు పరిహారం కోసం వెళ్లే మార్గంలోనే పరమేశ్వరుడునూ అనుకరించారు. పంచవతి సమీపానికి చేరుకున్న వెంటెనే గోదావరి నదిలో ఆ గోవులు స్నానమాచరించి. తమ బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకున్నాయి. అదే ప్రాంతంలో పరమేశ్వరుడునూ స్నానమాచరించి తన బ్రహ్మహత్యను పోగొట్టుకున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి.

FileFILE
తర్వాత శివపరమేశ్వరుడు సమీపంలో ఉన్న కొండపై ఆసీనులైయ్యారు. శివనాథుడిని వెన్నంటి వచ్చిన గోవు ఆయన ముందు మోకాలితో కూర్చొంది. అయితే తన బ్రహ్మహత్య దోష నివారణకు గురువుగా దోహదం చేసిన గోవు తన ముందు మోకాటి దండ వేసి ఆశీనులైంది. దీన్ని పరమేశ్వరుడు అంగీకరించకపోవడంతో ఈ ఆలయంలో నంది విగ్రహాన్ని ప్రతిష్టించబడలేదని పెద్దలు చెబుతున్నారు.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి శివభక్తులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పూర్వం "శివలింగం"గా పూజలందుకున్న కైలాస నాథుడి ఆలయాన్ని భక్తులు నిధులు సేకరించి ఆలయంగా నిర్మించారు.

ఈ ఆలయ సమీపంలో ఉన్న గోదావరి నదిలో "శ్రీరాముడు" ఆయన తండ్రి దశరథ మహారాజును స్మరించి పితృపూజను గావించినట్లు ప్రతీతి ఉండటంతో... వేలకొలది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పితృదేవతలకు పూజలు చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా, శ్రావణ మాస సోమవారాల్లో వేలకొలది భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి పరమేశ్వరుడిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. శ్రావణ మాసంతో సహా, ప్రతి సోమవారం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి.
రోడ్ మార్గం ద్వారా...
ముంబై నుంచి 160 కిలోమీటర్ల దూరంలో నాశిక్ ఉంది. అలాగే.. పూణె నుంచి 210 కిలోమీటర్లు. ఈ ప్రాంతాల నుంచి 24 గంటల పాటు బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం ద్వారా...
దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి నాశిక్‌కు పలు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అలాగే.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నాశిక్‌కు రైలు, బస్సు సర్వీసులు ఉన్నాయి.

విమాన మార్గం ద్వారా...
నాశిక్ పుణ్య క్షేత్రానికి 210 కిలోమీటర్ల దూరంలో పూణె విమానాశ్రయం ఉంది.