భక్తుల కోర్కెలు తీర్చే బీజాసేన్ ఆలయం

ఆదివారం, 13 ఏప్రియల్ 2008 (17:38 IST)
WD PhotoWD
చైత్ర నవరాత్రి సమీపిస్తున్నందున ఎక్కడ చూసినా ఆ పండుగ సంరంభాలే కనిపిస్తుంటాయి. ఈ సందర్భంగా మఠరాణి ఆలయంలో పొడవైన క్యూను మనం గమనించవచ్చు. నవరాత్రుల సీజన్‌లో బీజాసేన్ మఠ ఆలయాన్ని "వెబ్‌దునియా" మీకు పరిచయం చేస్తోంది. నవరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకుని ఇక్కడ ‘సత్ చండి మహాయజ్ఞం’ నిర్వహించబడుతుంది. ఈ 'యజ్ఞం'లో పాలు పంచుకునేందుకు గాను భక్తులు తెల్లవారు జాము నుంచే ఇక్కడ సమావేశమవుతుంటారు.

వైష్ణవ దేవి మఠం లాగే బీజాసేన్ మఠం కూడా విగ్రహరూపంలో ఇక్కడ వెలిసింది. ఈ విగ్రహాలు ఎవరో నిర్మించినవి కాక స్వయంగా వెలసినాయని దేవాలయ పూజారులు చెప్పారు. అయితే ఈ విగ్రహాల పూర్వాపరాల గురించి ఎవరికీ తెలీదు. పూజారి చెప్పిందాని ప్రకారం ఈ విగ్రహలు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాయి. కాగా తరం తర్వాత తరం ఈ విగ్రహాలను పూజిస్తూ వస్తున్నారు.

హోల్కర్ రాజుల పాలనలో ఈ ప్రాంతం, దాని పరిసర ప్రాంతం వేట మైదానంగా ఉపయోగించబడింది. కొంత మంది రాజకుటుంబీకులు 1920లో ఈ ప్రాంతాన్ని త
WD PhotoWD
స్వాధీనంలోకి తీసుకుని ఇక్కడ మఠాలయాన్ని నిర్మించారట. మఠంలో ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇక్కడ కోరుకున్న ప్రతి మొక్కు కూడా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో కొలను ఏర్పర్చారు. ఈ కొలనులో ఉన్న చేపలకు తిండిపెట్టడం పవిత్రకార్యం అని, అలా చేసినవారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

నవరాత్రి పర్వదినం సీజన్‌లో ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ జైన మతానికి సంబంధించిన రెండు పవిత్ర స్థలాలు ఉన్నాయి. అవి 'గోమట్ గిరి' మరియు 'హింకార్ గిరి'. ప్రతి సంవత్సరం జైన సన్యాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.