శివుని పంచభూత క్షేత్రాల్లో ఒకటి... శ్రీ అరుణాచలేశ్వర ఆలయం

K.Ayyanathan

ఆదివారం, 30 సెప్టెంబరు 2007 (19:26 IST)
WD PhotoWD
ఈ పవిత్ర పర్వతం చుట్టూ ప్రతి పౌర్ణమినాడు రెండు నుంచి మూడు లక్షల భక్తులు 14 కి.మీల మేర పాదరక్షలు లేకుండా ప్రదక్షిణం చేస్తారు. అంతేకాక సంవత్సరానికి ఒకసారి గిరి శిఖరంపై కనిపించే కార్తీక దీపాన్ని కనులారా వీక్షించేందుకు 10 నుంచి 15 లక్షల మంది ప్రజలు ఇక్కడకు చేరుకుంటారు.

హిందువులు పరమ పవిత్రంగా భావించే మహాశివరాత్రి పర్వదినం ఈ పుణ్య స్థలంలోనే ఆవిర్భవించింది. పరమశివుని అవతారంగా భక్తులు భావించే 2,665 అడుగుల ఎత్తైన ఈ పర్వతం శ్రీ అరుణాచలేశ్వరునిగాను, తమిళులు భక్తిప్రపత్తులతో పిలుచుకునే తిరు అన్నామలైయార్‌గాను పేరొందింది.

'వెబ్‌దునియా' తీర్థయాత్రలో, తలచినంతనే ముక్తిని (మరుజన్మంటూ లేకుండా భగవంతునిలో ఐక్యతనొందడం) ప్రసాదించే పవిత్ర ప్రాంతంగా పురాణాలలో ప్రస్తావించబడిన తిరువన్నామలై పుణ్య పట్టణానికి మరియు పురాతనమైన దేవాలయానికి అంతేకాక పవిత్రమైన పర్వతానికి మేము మిమ్మల్ని తీసుకువెళుతున్నాము.

పరమ శివుని పంచభూత క్షేత్రాలలో ఒకటిగా శ్రీ అరుణాచలేశ్వర వాసికెక్కింది. ఇది మహాశివుని అగ్ని క్షేత్రం (కంచి మరియు తిరువారూర్ భూమి, చిదంబర
WD PhotoWD
ఆకాశం, శ్రీకాళహస్తి వాయువు, తిరువానైక జలం).

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహాశివరాత్రి
తన యొక్క ప్రాముఖ్యాన్ని బ్రహ్మ మరియు విష్ణువులకు తెలియచేసేందుకు మహోజల్వమైన అగ్ని రూపంలో మహా శివుడు ఇక్కడ అవతరించాడని శివపురాణం చెబుతున్నది. ఒకానొక సందర్భంలో తామిరువురిలో ఎవరు గొప్ప అనే వాదన బ్రహ్మ మరియు విష్ణువు మధ్య చోటు చేసుకుంది. తమ తగువు తీర్చవలసిందిగా వారిరువురు పరమశివుని కోరారు.

WD PhotoWD
తన శిరస్సు లేదా పాదాన్ని చూడగలిగినవారే గొప్పవారంటూ శివుడు వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. చూస్తుండగానే భూమి నుంచి ఆకాశాన్ని తాకే మహోజ్వలమైన జ్వాలారూపాన్నిసంతరించుకున్న గంగాధరుడు తన శిరస్సు లేదా పాదాన్ని కనుగొనవలసిందిగా వారిని అడిగాడు.

శివుని పాదాన్ని కనుగొనేందుకు వరాహావతారాన్ని ఎత్తి మహావిష్ణువు భూమిని తవ్వుతుండగా, శివుని శిరస్సును కనుగొనేందుకు హంస రూపాన్ని దాల్చిన బ్రహ్మదేవుడు ఆకాశంలో సంచరించనారంభించాడు. ఓటమిని అంగీకరించిన శ్రీమహావిష్ణువు వెనుకకు తిరిగివచ్చాడు. అలసటనొందిన బ్రహ్మ దేవుడు ఆకాశం నుంచి నేలపైకి జారుతున్న పుష్పాన్ని (తాళమ్‌బు) చూసాడు.

ఎక్కడ నుంచి వస్తున్నావంటూ బ్రహ్మ ఆ పుష్పాన్ని అడుగగా, శివుని కేశాల నుంచి జారిపడిన తాను భూమిని చేరేందుకు యుగాల తరబడి ప్రయాణిస్తున్నట్లు సమాధానమిచ్చింది. అంతట ఒక ఉపాయం బ్రహ్మ దేవునిలో కలగడంతో తాను శివుని శిరస్సును చూసినట్లుగా శివునికి చెప్పవలసిందిగా బ్రహ్మదేవుడు ఆ పుష్పాన్ని అభ్యర్థించాడు.

అందుకు అంగీకరించిన పుష్పం శివునితో అసత్యమాడింది. అసత్యానికి ఆగ్రహించిన శివుడు భూమిని ఆకాశాన్ని కలిపే అగ్ని స్థంభంగా అవతరించాడు. భరించలేని అగ్నికీలల తాలూకు వేడిమి భూమితో పాటు స్వర్గాన్ని తాకింది. శివుని దేహం నుంచి జారిపడిన ఇంద్రుడు, యమడు, అగ్ని, కుబేరుడు తదాది అష్టదిక్పాలకులు శాంతించవలసిందిగా పరమశివుని ప్రార్ధించారు. శక్తి మరియు సకల దేవాధిపతులు కూడా శివుని ప్రార్థించారు. వారి ప్రార్థనలను మన్నించిన మహాశివుడు జ్యోతి స్వరూపునిగా మారిపోయాడు. దైవిక సంఘటనతో మహాశివరాత్రి పర్వదినానికి అంకురార్పణ జరిగింది.

లింగోద్భవం!

అంతట అగ్ని రూపాన్ని ఉపసంహరించుకున్న మహాశివుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీ అరుణాచలేశ్వర లేదా తిరు అన్నామలైయార్‌గా అవతరించాడు.
WD PhotoWD
పాదం చెంత వరాహ రూపంలో భూమిని తవ్వుతున్న శ్రీమహావిష్ణువు మరియు పుష్పం జారిపడుతుండగా హంస రూపంలో బ్రహ్మతో అగ్ని రూపుడైన పరమశివుని శిల్పమే లింగోద్భవ వృత్తాంతాన్ని తెలియచెప్పేది. అంతేకాక ప్రతి శివాయంలోని గర్భగుడి గోడ వెనుక లింగోద్భవ ఘట్టాన్ని తలపించే శిలాకృతులు దర్శనమిస్తాయి. ఆవిధంగా మూలం ఈ ప్రాంతంలోనే ఉన్నది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
అందుచేతనే అనాదిగా లక్షలాదిగా భక్తులు ప్రతి మాసం పౌర్ణమినాడు ఈ పర్వతానికి విచ్చేసి ప్రదక్షిణ చేస్తున్నారు. పర్వతం శివరూపమైనందున పర్వతం చుట్టూ అనేక నంది విగ్రహాలు అభిముఖంగా ఉంటాయి. అంతేకాక భౌగోళికంగా సైతం ఈ పర్వతం చాలా పురాతనమైనదిగా గుర్తించబడింది.

భక్తుల సౌకర్యార్ధం లింగ రూపంలో అన్నామలైయార్ దేవాలయంలో దర్శనమిచ్చేందుకు శంకరుడు అంగీకరించాడు. చోళుల ప్రారంభకాలం నాటిదిగా చెప్పబడే (రెండు శతాబ్దాల నాటిది) దేవాలయం ఒకటి పట్టణంలో ఉండగా ఆది అన్నామలైయార్ దేవాలయంగా పిలువబడే మరొక దేవాలయం పర్వత మార్గంలో గల పెద్ద దేవాలయానికి ఎదురుగా ఉన్నది.

పర్వత మార్గంలో ఇంద్రుడు, అగ్నిదేవుడు,యముడు, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు ఆదిగా గల దేవతలు పూజించిన ఎనిమిది లింగాలను మీరు దర్శనం చేసుకోవచ్చు. పాదరక్షలు లేకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినవారికి సర్వపాపాలు తొలగిపోయి ప్రాపంచిక బంధాల నుంచి విముక్తిని పొందిన
WD PhotoWD
వారై ముక్తి మార్గాన్ని చేరుకుంటారు. అందుకే ముక్తి సాధనకై ప్రదక్షిణ చేసే నిమిత్తం పిల్లలు, వృద్ధులు అను బేధం లేకుండా దేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఇక్కడకు వస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

"మనసులో తలచినంతనే నీవు ఈ పవిత్ర పాంత్రాన్ని చేరుకోగలవు" అని శ్రీరమణ మహర్షి మరియు శేషాద్రిస్వామి వ్యాఖ్యానించారు. ప్రయత్నించండి, జీవితానికి సరిపడా ఆధ్యాత్మిక అనుభవాన్ని సంపాదించండి.

WD PhotoWD
ఇక్కడకు చేరుకునే మార్గం:

రోడ్డు ద్వారా : చెన్నై నుంచి 187 కి.మీల దూరంలో ఉన్నది. అన్ని వేళలా అందుబాటులో ఉండే.. తమిళనాడు ప్రభుత్వ బస్సుల ద్వారా లేదా ట్యాక్సీల ద్వారా తిరువన్నామలైకు మీరు చేరుకొనవచ్చు.

రైలు ద్వారా: రైలు ప్రయాణంలో చుట్టూ తిరిగి పోవలసి ఉంటుంది. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి దిండివనం లేదా విళుపురం చేరుకునే రైలు ద్వారా ప్రయాణించి అక్కడి నుంచి తిరువన్నామలైకు చేరుకునే మరొక రైలులో ప్రయాణించవలసి ఉంటుంది.

పదకోశం:

గిరి ప్రదక్షిణ - పర్వతం చుట్టూ నడుచుట

కార్తీక దీపం - కార్తీక మాసంలో పర్వత శిఖరంపై దర్శనమిచ్చే పెద్దదైన జ్యోతి (ఆంగ్లమానం ప్రకారం దీపావళి అనంతరం నవంబర్ మాసంలో)

హంస - ఇప్పటికీ జీవించి ఉన్నట్లుగా చెప్పబడుతూ పాలలోని నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించే అందమైన పక్షి

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాళమ్‌బు (అనాస పుష్పం) - బ్రహ్మ కోసం అసత్యమాడి శివుని శాప ప్రభావంతో పూజకు పనికిరాకుండా పోయిన పొడవుగా ఉండి పరిమళాలు వెదజల్లే పుష్పం.

లింగోద్భవం - దృశ్యాన్ని వీక్షించండి.