02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

రామన్

శనివారం, 2 ఆగస్టు 2025 (02:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు సానుకూలమవుతాయి. లావాదేవీల్లో మెళకువ వహించండి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సమస్యలు నిదానంగా సద్దుమణుగుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు, స్థిమితంగాఉండటానికి యత్నించండి. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనుల్లో ఒత్తిడి అధికం. అభియోగాలు, ఎదుర్కుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పత్రాలు, నగదు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు విపరీతం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలను సమర్ధంగా నడిపిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. ఆరోగం జాగ్రత్త. వైద్యపరీక్షలు అనివార్యం. మీ శ్రీమతిలో మార్పు ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. సన్నిహితులు ప్రోత్సాహం అందిస్తారు. ఖర్చులు అధికం, పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు ఫలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. చాకచక్యంగా వ్యవహరించాలి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాదనలకు దిగవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సాయం ఆశించవద్దు. ధన సమస్యలు ఎదురవుతాయి, అవసరానికి ధనం అందుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య ఆకారణ కలహం. పంతాలకు పోవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు