ఈ సందర్భంగా ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం, అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు.
సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా తెల్లవారుజామున 5.15 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారని తిరుమల తిరుపతి ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు.