అనంతరం చినజీయర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ఆలయాలకు మహర్దశ వచ్చిందని, ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిపెట్టడం శుభపరిణామం అని కొనియాడారు. భద్రాద్రి ఆలయం వందేళ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. ఉత్తరంలో, దక్షిణంలో ఏది చేసినా సమానంగా ఉండేలా బ్యాలెన్స్ చేసుకోవాలని, కల్యాణ మండప నిర్మాణం శాస్త్రోక్తంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చినజీయర్ చెప్పారు.
భద్రాచలంలోని నిత్య కల్యాణ మండపం అన్నింటికంటే 25 అడుగుల ఎత్తులో విశాలంగా ఉండేలా చూడాలని చినజీయర్ స్వామి సూచించారు. ఆలయానికి నార్త్ ఈస్ట్‌లో కోనేరు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అంతేగాకుండా కోనేరు గోదావరిలోనే ఉండేలా సదుపాయం కల్పించాలని, అలాగే ఆలయానికి అనుసంధానంగా తప్పకుండా గోశాల ఏర్పాటు చేయాలని చినజీయర్ సూచించారు.