తిరుపతిలోని తితిదే వసతి సముదాయం విష్ణు నివాసంలో అన్యమతప్రచారం

ఆదివారం, 22 మే 2016 (16:22 IST)
తిరుపతిలోని తితిదే వసతి సముదాయం విష్ణునివాసంలో అన్యమతప్రచారం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఒక భక్తుడు బైబిల్‌ని చేతిలో ఉంచుకుని చదువుతూ కూర్చున్నాడు. అది కూడా విష్ణు నివాసం ప్రవేశ ద్వారంకు సమీపంలోనే. దాదాపు గంటకుపైగా అతను బైబిల్‌ పుస్తకాన్ని చదువుతూనే కూర్చున్నాడు. అయితే దీన్ని గమనించిన కొంతమంది భక్తులు ఇది బైబిల్‌ అని దీన్ని ఇక్కడ చదవకూడదని చెప్పారు.
 
అయితే ఆ అన్యమతస్థుడు భక్తులపైనే దౌర్జన్యానికి దిగాడు. మీరేంటి నాకు చెప్పేంది వెళ్ళడంటూ అక్కడి నుంచి అందరినీ పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశాడు. మరికొంతమంది భక్తులు అతని ఫోటోను సెల్‌ఫోన్‌లో తీసేందుకు ప్రయత్నించగా వారికి కూడా వారించే ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటి తర్వాత భక్తులందరు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అన్యమతస్థుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తితిదే విజిలెన్స్, నిఘా సిబ్బందితో పోలీసులు అన్యమతస్థుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి