22-06-2025 నుంచి 28-06-2025 వరకు వార ఫలితాలు

రామన్

ఆదివారం, 22 జూన్ 2025 (16:49 IST)
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. సోమవారం నాడు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా ఖర్చుచేయండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు దోహదపడతారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. దూరప్రయాణం తలపెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
ధృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావ్వివద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. అవసరాలు నెరవేరుతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. బుధవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. స్థిరాస్తుల వ్యవహారంలో తొందరపాటు తగదు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనంతో అవస్థలు తప్పవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. పూర్వ విద్యార్థుల సమ్మేషనంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదివారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రైవేట్ ఫైనాన్స్, చిట్స్ జోలికి పోవద్దు. గత అనుభవాలను గుర్తుచేసుకోండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సన్నిహితులతో తరుచుగా సంభాషిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వాహనదారులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారంలో మార్పులేదు. వ్యవహారాల్లో అప్రమతంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. మంగళవారం నాడు ఆచితూచి అడుగేయండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంతానం కృషి ఫలిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నిమయాలు క్రమం తప్పకుండా పాటించండి. నూతన వ్యాపారాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతలపై దృష్టిపెట్టండి. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఏకాగ్రతతో శ్రమించండి. అనుకున్న కార్యం సఫలమవుతుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. పెద్దల ఆశీస్సులుంటాయి. ఖర్చులు సామాన్యం. ప్రైవేట్ ఫైనాన్సులో పొదుపు తగదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇబ్బందులను ఆప్తులకు తెలియజేయండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ ఆలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా పాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాల, అపోహలకు తావివ్వవద్దు. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం ఉంది. విలాపాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. వివాదాస్పద విషయాల్లో మీ జోక్యం లేకుండా చూసుకోండి. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో విశేష ఫలితాలున్నాయి. ధృఢసంకల్పంతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రముఖులను ఆకట్టుకుంటుంది. బాధ్యతాయుతమైన పదవులు చేపడతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆదివారం నాడు పనులు ముందుకు సాగవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపరాలు చేపడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. హోల్సేల్ వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయంపైనే సంతానం భవిష్యత్తు ఆధారపడి ఉంది. శుక్రవారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఆపత్సమయంలో ఆప్తులు సహకరిస్తారు. ఆందోన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వ్యాఖ్యలు విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం ఖాయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా లేదు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ధృఢసంకల్పంతో ముందుకు సాగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహానికి గురికావద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సంకల్పం బలంగా ఉంటేనే లక్ష్యం నెరవేరుతుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను సావకాశంగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. బుధవారం నాడు కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఔషధసేవనం క్రమం తప్పకుండా పాటించండి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆలోచనలతో సతమతమమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగల కృషి ఫలిస్తుంది. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కష్టకాలం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాం. అధికారులకు హోదా మార్పు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఈ వారం అనుకూలదాయకం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి పరిచస్తులతో సంభాషిస్తారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు