భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు ఆరు బ్యాంకులు స్పాన్సర్‌షిప్ అందించాయి. బ్యాంకులు ఒక్కో కౌంటర్‌కు నెలకు సుమారు 40,365 రూపాయలు స్పాన్సర్‌షిప్‌గా చెల్లిస్తున్నాయి. ఇండియన్ బ్యాంకు 10, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు 5, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3, కెనరా బ్యాంకు 3, ఫెడరల్ బ్యాంకు 3, తిరుమల బ్యాంకు 2, కౌంటర్లకు స్పాన్సర్ షిప్ చేశాయి.