తిరుమలలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - దర్శనం నిలిపివేత

సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:54 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. స్వామివారి ఆలయాన్ని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో తితిదే సిబ్బంది శుద్ధిద్థి చేయనున్నారు. కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా బుధవారం ఉదయం 11 గంటల వరకు దర్శనాన్ని టిటిడి అధికారులు నిలిపివేయనున్నారు. 
 
అలాగే పలు ఆర్జిత సేవలను కూడా రద్దు చేయన్నారు. ప్రతియేటా జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం తితిదేకి ఆనవాయితీగా వస్తోంది. అక్టోబరు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి