శ్రీవారి ఆలయంలో కనువిందు చేసిన నెలవంక.. ముక్కోటి ఏకాదశికి ముస్తాబు

మంగళవారం, 3 జనవరి 2017 (09:54 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో నెలవంక కనువిందు చేసింది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నెలవంకతో పాటు మరో పెద్ద నక్షత్రం అందరినీ ఆకర్షించాయి. వెంకన్న ఆలయానికి వెళుతుంటే చంద్రుడు వెంటపడుతున్నట్లు ఈ ఫోటో ఉంది. ఆలయ గోపురంపై తారాచంద్రులు సౌందర్యవంతంగా కనిపించడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. 
 
తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఆయా పర్వదినాల్లో వీఐపీలు స్వయంగా వస్తే టికెట్లు కేటాయిస్తామని, ఒక్కో వీఐపీ టికెట్ ధర రూ.1000 అని పేర్కొన్నారు. కొత్త ఏడాది జనవరి 8, 9 తేదీల్లో నడకదారి భక్తులకు దివ్యదర్శన టోకెన్లను రద్దు చేసినట్లు శ్రీనివాసరాజు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి