నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఈ సంఖ్య వారంతాల్లో, సెలవుల్లో అయితే భక్తుల సంఖ్య లక్ష దాటేది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగేవి.
అయితే తిరుమలకు వెళ్లిన భక్తులు ఎవరికీ ఇంతవరకు కరోనా సోకలేదు. కానీ, తితిదే ఉద్యోగుల్లో 91 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో భక్తులు కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా తిరుమల భక్తుల సందడి పెద్దగా లేకుండా కనిపిస్తోంది.