ఇటీవల అన్నవరం హైవేపై ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్‌లో ప్రసాదం బుట్టల మధ్య ఎలుకలు పరుగులు తీస్తూ తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. వాటిని వీడియోగా తీసిన ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే ప్రసాదం పరిశుభ్రతపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వీడియో రావడంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది.