పద్మావతి అమ్మవారికి రూ. 17 లక్షల తులాభారం, టిటిడి ఈవోనే తొలిసారిగా..?

శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:56 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మివ్రతం పర్వదినం సంధర్భంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖామంత్రి వేణుగోపాలక్రిష్ణ, టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు కలిసి తులాభారం ప్రారంభించారు. ఆలయంలోని సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తరువాత ఛైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభారాన్ని ప్రారంభించారు.
 
మొదటగా ఈవోనే తులాభారంలో కూర్చున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టిటిడి నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జయచంద్ర దంపతులు 17 లక్షల రూపాయల విలువైన తులాభారం ఆలయానికి బహూకరించారు.
 
దీంతో ఈ తులాభారాన్ని వరలక్ష్మి వ్రతం సంధర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి భక్తులకు తులాభారం అందుబాటులో రానుంది. పుట్టిన పిల్లలకు ఎక్కువగా మ్రొక్కులు తీర్చుకోవడానికి తులాభారాన్ని సాధారణంగా వాడుతుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు