ఈ దాడిలో మధు గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో రవళి, సోహైల్‌తో పాటు గూడెల్లి సాయికుమార్, బారెడ్డి శశిధర్‌రెడ్డి, బారెడ్డి ప్రతాప్‌రెడ్డి, అశ్విని కుమార్ సింగ్, షేక్ షరీఫ్ ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.