శ్రీవారి ఆలయాన్ని మూశారు.. శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచే ఉంచారు.. (Video)

బుధవారం, 31 జనవరి 2018 (12:52 IST)
చంద్రగ్రహణం కారణంగా కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న ఆలయాన్ని మూసేశారు. చంద్రగ్రహణం కావడంతో తిరుమల ఆలయాన్ని ఉదయం 11 గంటలకు వేదపండితులు మూశారు. గ్రహణం సమయంలో ఆలయాలను తెరవకూడదని పురాణాలు చెబుతుండటంతో ఆలయాన్ని మూశారు. ఒక్క తిరుమలేకాకుండా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి, కాణిపాకం ఆలయాలను కూడా మూసివేశారు. 
 
అయితే శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ఆలయ అధికారులు తెరిచే ఉంచారు. గ్రహాలకు అతీతుడు ముక్కంటీశ్వరుడు కావడంతో ఆలయాన్ని తెరిచి ఉంచారు. అయితే గ్రహణం జరుగుతున్న సమయంలో మాత్రం శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. మిగిలిన ఆలయాలను మాత్రం రాత్రి 9.30 నిమిషాల తరువాత శుద్ధి చేసి తిరిగి యధావిధిగా భక్తుల సర్వ దర్శనానికి అనుమతిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు