20, 21 తేదీలలో తరిగొండ వెంగమాంబ 286 జయంతి ఉత్సవాలు

శనివారం, 14 మే 2016 (11:43 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 286 జయంతి ఉత్సవాలు మే 20, 21 తేదీలలో తితిదే నిర్వహించనుంది. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటికే తరిగొండ వెంగమాంబ పేరుతో తిరుమలలో నిత్యాన్నదాన సముదాయాన్ని తితిదే నడుపుతోంది.
 
మే 20వ తేదీ తరిగొండ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఉదయం 7.30 నుంచి 9.30 వరకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరుగనుంది. ఆ తర్వాత నిరంతరాయంగా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే తిరుపతి ఎంఆర్‌పల్లి సర్కిల్‌ వద్ద నున్న వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి