తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు...

బుధవారం, 25 మే 2016 (12:36 IST)
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. సర్వదర్శనం, కాలినడక కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కంపార్టుమెంట్ల ఫుల్‌‌గానే ఉన్నాయి. తితిదే దర్శనానికి అనుమతిస్తున్నా భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. 
 
కంపార్టుమెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. గదులు కూడా దొరకడం లేదు. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట, మినీ కళ్యాణ కట్టల వద్ద కూడా అదే పరిస్థితి. మరో వారంరోజుల పాటు ఇదేవిధంగా ఉంటుందని తితిదే భావిస్తోంది. నిన్న శ్రీవారిని 82,939మంది భక్తులు దర్సించుకోగా, హుండీ ఆదాయం 2కోట్ల 31లక్షల రూపాయలు లభించింది. 

వెబ్దునియా పై చదవండి