తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

ఆదివారం, 1 మే 2016 (18:52 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతం కావడంతో శనివారం నుంచి భక్తుల రద్దీ కనిపిస్తోంది. తిరుమల సర్వదర్శనం కంపార్టుమెంట్లతో పాటు కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. సర్వదర్శనం కోసం 15 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలకు పైగా దర్శన సమయం పడుతోంది. 
 
తలనీలాల ఇచ్చే కళ్యాణకట్ట వద్ద కూడా ఇదే పరిస్థితి. తలనీలాలు ఇవ్వడానికి 5 గంటల సమయం పడుతోంది. కళ్యాణకట్ట వద్దనున్న క్యూలైన్లు కూడా భక్తులతో నిండిపోయాయి. గదులు ఖాళీ లేవంటూ టిటిడి ఆన్‌లైన్‌ సర్వర్లలో దర్శనమిస్తున్నాయి. రోడ్లపైనే భక్తులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న శ్రీవారిని 82,347మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం కోటి 74లక్షల రూపాయలు లభించింది.

వెబ్దునియా పై చదవండి